మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మూడు జోన్లలో 19పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఎన్నికలు జరగుతున్నట్లు వివరించారు. ఎన్నికల కోసం 4,107మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు సీపీ స్పష్టం చేశారు.
'మున్సిపల్ పోలింగ్ కోసం పటిష్ఠ బందోబస్తు'
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పురపాలక ఎన్నికల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 17మున్సిపాలిటీలు 5 మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరుగనుందని పేర్కొన్నారు.
'ఎన్నికలకోసం పటిష్ఠ బందోబస్తు'
సివిల్, ఏఆర్, హోంగార్డులు, ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లైసెన్స్ కలిగిన వ్యక్తులు 598 ఆయుధాలు సరెండర్ చేశారన్నారు. 216మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.80వేల నగదు, 843లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.
ఇదీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి