తెలంగాణ

telangana

ETV Bharat / state

మహీంద్ర లాజిస్టిక్​ ఎలైట్​ రవాణా సేవలపై మహేశ్​ భగవత్​ హర్షం

ఏప్రిల్ 7న రాచకొండ పోలీసులు, మహీంద్ర లాజిస్టిక్‌ ఎలైట్‌ సంస్థ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ-సేవా కేంద్రానికి నెల రోజుల్లో 358 కాల్స్‌ ప్రజల నుంచి వచ్చినట్లు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. డయాలసిస్ రోగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ సేవలను అధికంగా వినియోగించుకున్నట్లు వివరించారు.

మహీంద్ర లాజిస్టిక్​ ఎలైట్​ రవాణా సేవలపై మహేశ్​ భగవత్​ హర్షం
మహీంద్ర లాజిస్టిక్​ ఎలైట్​ రవాణా సేవలపై మహేశ్​ భగవత్​ హర్షం

By

Published : May 11, 2020, 8:34 PM IST

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన మహీంద్ర లాజిస్టిక్‌ ఎలైట్‌ రవాణా సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 7న రాచకొండ పోలీసులు, మహేంద్ర లాజిస్టిక్‌ ఎలైట్‌ సంస్థ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రానికి నెల రోజుల్లో 358 కాల్స్‌ ప్రజల నుంచి వచ్చినట్లు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. మహీంద్రా ఎలైట్ సేవలను ప్రశంసించిన ఆయన.. సేవా కేంద్రాన్ని సమన్వయం చేసిన సంస్థకు చెందిన శివాలి, ఎడ్వర్డ్, ఇన్‌స్పెక్టర్‌ రవిలను కమిషనర్​ సత్కరించారు.

"వైద్యేతర, అత్యవసర రవాణా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ క్యాబ్ సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా డయాలసిస్ రోగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ సేవలను అధికంగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ తరహా సేవలు ఏర్పాటు చేశారు. అవసరమైన రోగులకు ఉపయోగపడడం నాకెంతో సంతృప్తినిచ్చింది. "

-మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

మహీంద్ర లాజిస్టిక్​ ఎలైట్​ రవాణా సేవలపై మహేశ్​ భగవత్​ హర్షం

ఇదీ చూడండి:'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ABOUT THE AUTHOR

...view details