హైదరాబాద్ ఎల్బీనగర్లోని పిల్లల ట్రాఫిక్ శిక్షణ పార్క్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారి, వినికిడి, శ్వాసకోశ సమస్యల దృష్ట్యా వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశ్రో అనే స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని నిర్వహించింది.
కరోనాపై అసత్య ప్రచారాన్ని సహించేది లేదు: సీపీ
రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని పిల్లల ట్రాఫిక్ శిక్షణ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన మహేష్ భగవత్
ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందికి కరోనాపై అవగాహన కల్పించామని సీపీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్, ఎసీపీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.