రాష్ట్రంలో విద్యాసంస్థల మూసివేతపై ప్రభుత్వం పునరాలోచించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. కరోనాను సాకుగా చూపి... కొందరు అధికారుల తప్పుడు సమాచారంతో విద్యాసంస్థలను మూసివేయటం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని వాపోయారు. హైదరాబాద్ నారాయణగూడలో 14బీసీ సంఘాల ప్రతినిధులతో కృష్ణయ్య సమావేశం నిర్వహించారు.
విద్యాసంస్థలు మూసివేయడం వల్ల విద్యార్థులు జ్ఞానసంపదను కోల్పోతారని... ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. పక్కరాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని... రాష్ట్రంలో వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.