ఏపీ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో విచిత్రమైన ప్రశ్నలు అడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడి స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులు.. అందులోని ప్రశ్నావళిని చూసి హైరానా పడుతున్నారు. 14 పేజీల్లోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నింపడం గగనంగా మారుతోంది. పొరపాటు దొర్లితే.. నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
నామినేషన్ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు! - నామినేషన్ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు
‘మీకు విమానాలున్నాయా? ఓడలున్నాయా? వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సుంకాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? వాటి వివరాలు నమోదు చేయండి!’ ఇవీ.. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అడుగుతున్న ప్రశ్నలు.
నామినేషన్ పత్రంలో చిత్రమైన ప్రశ్నలు!
ఆస్తులు, అప్పులు నిర్ధరించే స్వీయ ధ్రువీకరణ పత్రంలోని ప్రశ్నలు పల్లెల్లోని సామాన్యులకు వర్తించేలా లేవు. గతంలో మోటారు వాహనాల వివరాలు మాత్రమే అడగ్గా.. ఈసారి విమానాలు, పడవలు, ఓడలు వంటివి చేర్చడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లో ఈస్థాయి ఆర్థిక సంపన్నులు పోటీ చేస్తారా? అన్న ప్రశ్న వస్తోంది.
ఇదీ చదవండి:కంప్యూటర్ విద్యలో తెలంగాణ వెనకబాటు
TAGGED:
nominations