తెలంగాణ

telangana

ETV Bharat / state

మాదాపూర్​ పోలీస్ స్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా - క్యూనెట్​ మోసం

క్యూనెట్​ కేసులో విచారణ వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ బాధితులు మాదాపూర్​ పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. మల్టీ లెవల్​ మార్కెటింగ్​ పేరిట యువత, నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఈ కేసులో 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాదాపూర్​ పోలీస్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా

By

Published : Aug 4, 2019, 11:35 PM IST

మాదాపూర్​ పోలీస్టేషన్​ ఎదుట క్యూనెట్​ బాధితుల ధర్నా

క్యూనెట్ నిందితులను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. నిందితులను త్వరగా అదుపులోకి తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని బాధితులు నినాదాలు చేశారు. క్యూనెట్​ బారినపడిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

హైదరాబాద్​లోని మాదాపూర్​లో క్యూనెట్​ మల్టీ లెవెల్​ మార్కెటింగ్​ పేరిట భారీ కుంభకోణం జరిగింది. క్యూనెట్​ సంస్థలో డబ్బులు జమచేస్తే రెండితల ఆదాయం వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించి భారీగా వసూళ్లకు పాల్పడింది. రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి: శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details