మాజీ ప్రధాని పీవీకి ప్రముఖుల నివాళులు PV Death Anniversary: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతిని పురస్కరించుకుని... పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
పీవీ... ఆర్థిక సంస్కరణల పితామహుడు. అందరికీ ఆయన ఆదర్శప్రాయుడు. పీవీ బహుబాషా కోవిదుడు. 9 ఇండియన్ భాషలు, 8 విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. పిల్లలంతా పీవీని ఆదర్శంగా తీసుకోవాలి. మీరంతా కూడా ఎక్కువ భాషలు నేర్చుకోవాలి. అందుకు తగిన విధంగా ప్రాక్టీస్ చేయాలి. పీవీ మార్గంలో మనమంతా నడవాల్సిన అవసరం ఉంది.
-- తమిళిసై, గవర్నర్
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌజ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కాంగ్రెస్ సీనియర్ వి.హన్మంతురావుతో పాటు పలువురు ప్రముఖులు పీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు.
దేశంలో దక్షిణాది వారికి సరైన గుర్తింపు లభించటంలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రమాదపుటంచున ఉన్న దేశానికి ఎన్నో సంస్కరణలతో బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పీవీని కేంద్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వటంలేదన్నారు. జాతి రత్నంగా పీవీని పిలుస్తున్నామని... శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరిపిందని ఎమ్మెల్సీ వాణీదేవి తెలిపారు.
ఇవీ చూడండి: