కొటక్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాడ్మింటన్ శిక్షకుడు పుల్లెల గోపీచంద్ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడలో సౌకర్యాల కల్పన కోసం ప్రముఖ శిక్షకుడు పుల్లెల గోపీచంద్ కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని పోటీలు ఏసీ కోర్టుల్లోనే జరుగుతాయని తదనుగుణంగా ఆరు ఏసీ కోర్టుల నిర్మాణానికి ఒప్పందం జరిగినట్లు తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాడ్మింటన్‌లో మరిన్ని అద్భుతాలు సాధించడానికి అవకాశాలను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.