సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ విద్రోహదినం పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించి... కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన
సీపీఎస్ రద్దు కోసం.. విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించి పోరాడుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్, ఒప్పంద ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహదినం పాటించారు.
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకుల నిరసన
ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగుల హక్కు అని... అది ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని అన్నారు. ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు గొడ్డలిపెట్టుగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం జరిగే పోరాటంలో అన్ని సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఇవీచూడండి:మైనర్పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం