రాష్ట్రంలో పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ మేరకు నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. కరోనా సాకుతో పాఠశాలలను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభించాలంటూ ధర్నా
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తక్షణమే ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన
ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల మూసివేత వల్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు శాశ్వతంగా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు నడుస్తున్నాయని.. కేవలం పాఠశాలల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.