తెలంగాణ

telangana

ETV Bharat / state

'సుబ్బయ్య హత్యతో నాకేం సంబంధం..?'

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య వెనుక ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ హస్తం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆమె పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చాల్సిందేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌
సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌

By

Published : Dec 31, 2020, 7:09 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు తన పేరును అనవసరంగా తెరపైకి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. గురువారం ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.

కావాలనే సుబ్బయ్య కుటుంబం నాపేరు ప్రస్తావిస్తోంది. సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా. ఘటనాస్థలికి సుబ్బయ్య వస్తే కాసేపు ఉండమని మాత్రమే చెప్పా. పూజ అయిపోయాక వస్తానని చెప్పి ఆయన ఫోన్​ మాట్లాడుతూ వెళ్లిపోయారు. కాసేపటికే పెద్దగా అరుపులు వినిపించాయి. నేను వెళ్లి చూసేసరికి ఆయన చనిపోయాడు. ఎవరు చంపారో నేను చూడలేదు. దయచేసి రాజకీయాల్లోకి అధికారులను లాగొద్దు. నందం సుబ్బయ్య హత్యకేసులో ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం- రాధ, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌

ఇదీ చదవండి:కోతిని తరమబోయాడు.. ప్రాణాలు విడిచాడు

ABOUT THE AUTHOR

...view details