లాక్డౌన్ సమయంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఐదు నెలల నుంచి జీతాలు లేక తిండికి సైతం గడవడం లేదని తెలంగాణ ప్రైవేట్ అండ్ గెస్ట్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. జీవో నెంబర్ 45 ప్రకారం ప్రైవేటు ఉపాధ్యాయులకు జీతాలు అందించాలని కోరారు. జీవో నెంబర్ 1, 1994 చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీతాలు ఇప్పించాలని.. సబితకు ప్రైవేట్ టీచర్ల వినతి - ప్రైవేట్ అండ్ గెస్ట్ లెక్చరర్స్ యూనియన్
గత ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.. జీవో 45 ప్రకారం ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ జీతాలు ఇప్పించాలని తెలంగాణ ప్రైవేట్ అండ్ గెస్ట్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు.
జీతాలు ఇప్పించాలని సబితా ఇంద్రారెడ్డిని కలిసిన ప్రైవేట్ టీచర్లు
ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణకు ప్రభుత్వం రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిటీ వేయాలని, ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయుల వినతికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. ప్రైవేట్ పాఠశాలల ప్రక్షాళనకు ఒక కమిటీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!