కరోనా పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ... ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల బాధితుల సంఘం హైదరాబాద్ కోఠిలోని ప్రజా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. లక్షల రూపాయలు ఈ ఆసుపత్రులు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సంఘం నాయకులు ప్రశ్నించారు.
'కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి'
కరోనా వైరస్ పేరిట ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు లక్షల రూపాయలు దండుకుంటున్నాయని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల బాధితుల సంఘం ఆరోపించింది.
ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా సోకిన పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 248 ప్రకారం ఇచ్చిన రేట్లు ప్రైవేటు ఆసుపత్రులలో అమలయ్యేలా చూడాలని... తెలంగాణలో అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల కు విరుద్ధంగా నడిచే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.