కరోనాతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని ప్రైవేట్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఇవాళ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు.
ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం - ప్రైవేట్ డ్రైవర్ల ఆందోళన
ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల ప్రయత్నించారు. ప్రైవేట్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరోనా కారణంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి ప్రైవేట్ డ్రైవర్ల యత్నం
ప్రైవేటు డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రగతిభవన్ వద్దకు చేరుకున్న డ్రైవర్లను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కొవిడ్ కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :హైదరాబాద్లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్