సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్ - cm kcr latest review
15:01 July 22
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదిని ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్లో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు