తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితో ముగియనున్న రాష్ట్రపతి దక్షిణాది పర్యటన - నేటితో ముగియనున్న రాష్ట్రపతి దక్షిణాది పర్యటన

రాష్ట్రపతి ​ దక్షిణాది పర్యటన నేటితో ముగియనుంది. రామ్​నాథ్​ కొవింద్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. ఆయనకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు వీడ్కోలు పలకనున్నారు.

president return to Delhi today
నేటితో ముగియనున్న రాష్ట్రపతి దక్షిణాది పర్యటన

By

Published : Dec 28, 2019, 5:49 AM IST

Updated : Dec 28, 2019, 7:20 AM IST

నేటితో ముగియనున్న రాష్ట్రపతి దక్షిణాది పర్యటన

శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. దక్షిణాది పర్యటన కోసం కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 20న హైదరాబాద్ వచ్చారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బసచేసిన రామ్ నాథ్ కోవింద్... 22న రాజ్ భవన్​లో గవర్నర్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

వీడ్కోలు పలకనున్న ప్రముఖులు

23 నుంచి 26 వరకు తమిళనాడు, పాండిచ్చేరిలో పర్యటించారు. నిన్న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. రామ్ నాథ్ కోవింద్ ఇవాళ దిల్లీ తిరిగి పయనం కానున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు.

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

Last Updated : Dec 28, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details