నాలుగు మండలాల్లో దళితబంధు అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సోమవారం ప్రగతిభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో హుజూరాబాద్‌తో పాటుగా... పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు.
Dalit Bandhu: దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సన్నాహక సమావేశం - దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం
నాలుగు మండలాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. దళితబంధు పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.
ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొంటారు. ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా, తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. దళితబంధు పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి:DALIT BANDHU: మురిసిన వాసాలమర్రి.. లబ్ధిదారులకు అందిన దళితబంధు నగదు