తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణికి పోటెత్తిన దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు

Prajavani Programme in Telangana Today : ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. అధికారులకు తమ గోడును విన్నవించుకోవడానికి అర్జీదారులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. రెండు పడక గదుల ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన అధికారులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

Mid Day Meal Workers at Prajavani
Prajavani Programme in Telangana Today

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 8:06 PM IST

ప్రజావాణికు పోటెత్తిన దరఖాస్తులు- ఇప్పటికైనా సమస్యలు తీర్చండని నిరసనలు

Prajavani Programme in Telangana Today : ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల ఫిర్యాదులు పోటెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అర్జీదారులను ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్‌లోకి అనుమతించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లలో సిబ్బంది వారిని లోనికి తీసుకువెళ్లారు.

ప్రజావాణికి విశేష స్పందన - కలెక్టర్​ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు

Heavy Applicants toPrajavani Programme : రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి హాజరైన ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. పింఛన్లు, భూ సమస్యల ఎక్కువ అర్జీలు అందినట్లుగా అధికారులు తెలిపారు. తన సమస్యను పరిష్కారించాలని కోరుతూ ప్లకార్డుతో నిల్చున్న అర్జీదారుని చూసి ప్రజాభవన్ నుంచి బయటకు వెళ్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కారును ఆపారు. సమస్యపై ఆరాతీసి అతని నుంచి అర్జీని స్వీకరించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

"కంది మండలంలోని చెర్లగూడ గ్రామంలో వికలాంగుల కోటా కింద ఇచ్చిన ఫ్లాట్‌లన్నీ కబ్జా చేశారు. అందులో నాది కూడా చేసి ఇల్లు నిర్మించారు. నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను."- ప్రజావాణి దరఖాస్తుదారుడు

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు


Mid Day Meal Workers at Prajavani : మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజాభవన్‌(Mid Day Meal Workers Protest at Prajabhavan)కు తరలివచ్చారు. ప్రతి నెల 10వ తేదీలోగా మెస్‌బిల్లులు, జీతాలు చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. జీఓ నెం 46ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. గత ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ప్రభుత్వమైన తమకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

"గత ఆరు నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వలేదు. పెండింగ్‌ బిల్లులు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. నిత్యవసర ధరలు పెరిగిపోయాయి. ప్రజావాణికి వచ్చి గతంలో ఇప్పుడు కలిశాం. ఈ ప్రభుత్వంలో మూడోసారి వచ్చాం. మా సమస్య ఇప్పటికైనా పరిష్కారం అవుతుందో లేదో తెలియడం లేదు. మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎప్పటికైనా మాకు న్యాయం చేస్తాదేమో అనే అశతో పని చేస్తున్నాం."- మధ్యాహ్న భోజన ఉద్యోగి

ప్రజావాణికి విశేష స్పందన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Police Arrangements to Prajavani Programme : ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ సైతం స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వలన సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాభవన్ ఎదుట ఉన్న రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

ప్రజావాణికి భారీ స్పందన- ప్రజాభవన్​కు బారులు తీరిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details