హైదరాబాద్ కూకట్పల్లి ప్రగతినగర్లో నీటి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి కష్టాలకు పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. మంజీరా నుంచి వచ్చే నీరు సక్రమంగా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇంటి నల్ల కనెక్షన్లకు ఒక్కొక్క దానికి 55 వేల చొప్పున వసూలు చేస్తూ కనీసం తాగునీటి వసతిని అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా నీటి కష్టాలను పరిష్కరించాలని కోరారు.
నీటి కష్టాలు తొలగించాలంటూ ప్రగతినగర్లో ర్యాలీ - rally
కూకట్పల్లి ప్రగతినగర్లో నీటి ఎద్దడి నెలకొందంటూ కాలనీవాసులు ర్యాలీ చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నీటి కష్టాలు తొలగించాలంటూ కాలనీవాసుల ర్యాలీ