వైద్యులు, సిబ్బంది, రోగులు వాడిపడేసిన పీపీఈ కిట్లు గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని పద్మారావునగర్ వాసులు విలవిల్లాడుతున్నారు. కొందరు ఇళ్లను సైతం ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వాటి వల్ల తమకూ కరోనా సోకుతుందేమోనని బెంబెలెత్తిపోతున్నారు. వైద్య సిబ్బందితో పాటు రోగులూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో నెలకొన్నాయి.
గాంధీలో 1000కి పైగా కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న తరుణంలో పెద్ద ఎత్తున పీపీఈ కిట్ల వాడకం పెరిగింది. రోగులు, వైద్యులు, నర్సులు, వార్డుల్లో పని చేసేవారు ఉపయోగించిన కిట్లు రోజుకు 2 వేలకు పైగానే ఉంటున్నాయి.