తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల వివాదాలపై విచారణ వాయిదా - ordinence

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణ కేసులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కొత్త మున్సిపల్​ చట్టాన్ని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ గడువు ఎందుకు తగ్గించారో తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించిన వివాదాలపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

మున్సిపల్​ ఎన్నికల వివాదాలపై విచారణ వాయిదా

By

Published : Aug 14, 2019, 8:07 PM IST

రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు పాత చట్టం ప్రకారమే ప్రక్రియ పూర్తి చేసినట్లు ప్రభుత్వం... హైకోర్టుకు తెలిపింది. వార్డుల విభజన, ఓటరు జాబితా సవరణ, రిజర్వేషన్లు తదితర ప్రక్రియకు కొత్త చట్టంతో సంబంధం లేదని తెలిపింది. నిబంధనలు పాటించకుండా హడావిడిగా మున్సిపల్​ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారంటూ... దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

ఉల్లంఘనలు లేవంటున్న ప్రభుత్వం

మున్సిపాల్టీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సర్కారు నిబంధనలు ఉల్లంఘిచిందని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే పాత చట్టంలోని నిబంధనలు, జీవో 78 ప్రకారమే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టామని.. ఎక్కడా ఉల్లంఘనలు లేవని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు.

మున్సిపల్​ ఎన్నికల వివాదాలపై విచారణ వాయిదా
పూర్తి వివరాలు సమర్పించండి:
రాష్ట్రంలో కొత్త మున్సిపాల్టీ చట్టం రూపొందిస్తూ... ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత.. పాత చట్టం ప్రకారం వార్డుల విభజన ఇతర ఏర్పాట్లు చేయడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత పాత చట్టాన్ని ఎలా అనుసరించారని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త చట్టం, ఆర్డినెన్సును తమకు సమర్పించాలని సర్కారును ఆదేశించింది. అదేవిధంగా వార్డుల విభజన, రిజర్వేషన్లకు అనుసరించిన విధివిధానాలేంటో పూర్తి వివరాలను నివేదించాలని స్పష్టం చేసింది.
ఎల్లుండికి వాయిదా
సర్కారు ఉద్దేశపూర్వకంగా హడావిడిగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోందని పిటిషనర్లు వాదించారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు 109 రోజుల సమయం పడుతుందన్న ప్రభుత్వం... 8 రోజులకు కుదించిందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ చేపట్టే గడువును ఎందుకు కుదించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించిన కేసులన్నీ కలిపి ఎల్లుండి... తదుపరి విచారణ చేపడామని హైకోర్టు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details