తెలంగాణ

telangana

ETV Bharat / state

మామకు కరోనా పాజిటివ్... అల్లుడిపై కేసు - corona cases

కరోనా పాజిటివ్​గా తేలిన తన మామను ఆసుపత్రిలో కలిసి...నాలుగేళ్ల కుమారుడితో సహా రహస్యంగా ఇంటికి చేరిన అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

positive-to-uncle-case-against-son-in-law
మామకు కరోనా పాజిటివ్... అల్లుడిపై కేసు

By

Published : Apr 14, 2020, 6:08 AM IST

కరోనా పాజిటివ్​గా తేలిన తన మామను ఆసుపత్రిలో కలిసి... నాలుగేళ్ల కుమారుడితో కలిసి... రహస్యంగా ఇంటికి చేరిన అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిని ఇటీవల తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన తన మామ గారింటికి పంపారు. మామకు గుండె నొప్పి రావటంతో బంధువులు ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.

వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. ఆసుపత్రి వద్ద ఉన్న తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చిన అల్లుడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతనితో పాటు కుటుంబసభ్యులందరినీ ఒంగోలులోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఇంటిచుట్టు పక్కల వారికి నోటిసులు జారీ చేసి... ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇదీచదవండి:'లాక్‌డౌన్‌ ముగిసిన వారం వ్యవధిలోనే పరీక్షలు'

ABOUT THE AUTHOR

...view details