శకున్ పాండేని అరెస్టు చేయాలి : పొన్నం - congress
జనవరి 30న పూజా శకున్ గాంధీ విగ్రహాన్ని అవమానించడంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
fires on bjp
హిందూ మహాసభలో భాజపా కార్యకర్తల తీరు దేశానికే అవమానమని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జనవరి 30న గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి పూజా శకున్ పాండేని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భాజపాకి హిందూ మహాసభకి సంబంధాలు ఉండడం వల్లే చర్యలు తీసుకోవడంలేదని ప్రభాకర్ మండిపడ్డారు.