తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ప్రజల సొమ్ముతో కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టారు' - సీఎం కేసీఆర్​పై మండిపడ్డ పొన్నాల లక్ష్మయ్య

Ponnala Comments on CM KCR : సీఎం కేసీఆర్​పై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. దోపిడీ కోసమే కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించకుండా.. జాతీయపార్టీని ఎలా పెట్టారు అని ప్రశ్నించారు.

Ponnala Lakshmaiah
మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

By

Published : Dec 30, 2022, 7:16 PM IST

Ponnala Comments on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో జాతీయ పార్టీ అంటూ బయలుదేరారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కేసీఆర్‌ దోపిడీ కోసమే జాతీయ పార్టీ పెట్టారని హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. జాతీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయలేదని చెబుతారా అని నిలదీశారు. కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ వైఫల్యాలు కేసీఆర్‌కు కనిపించడం లేదా అని మండిపడ్డారు.

తెలంగాణ కోసం ఏమీ చేయలేని బీజేపీ నాయకులు.. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. విభజన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చే బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమెంతో అందరికీ తెలుసని.. 90 సీట్లు కాకుండా 119 సీట్లు అంటే బాగుండని లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details