తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంట్రాక్టర్​ నుంచి కేసీఆర్‌కు సవాల్‌ విసిరే వరకు - పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రస్థానం సాగిందిలా

Ponguleti Srinivas Reddy Political Carrier : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గ స్థానాల్లో ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ నేతను అసెంబ్లీ గేట్ తాకనివ్వనని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఈ సవాల్‌లో దాదాపు తన పంతం నెగ్గించుకున్నారు. ఇటీవల ప్రకటించిన శాసనసభ ఫలితాల్లో జిల్లాలోని 10 స్థానాలకు గానూ 9 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా బీఆర్ఎస్‌ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కొలువుదీరిన నూతన మంత్రివర్గంలో పొంగులేటి చోటు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం.

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 5:43 PM IST

Ponguleti Challages KCR on Khammam Elections
Ponguleti Srinivas Reddy Political Carrier

Ponguleti Srinivas Reddy Political Carrier :ఒక కాంట్రాక్టర్‌గా మాత్రమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయ పలుకుబడి ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivasreddy). 2013 ఫిబ్రవరి 23న రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరో 3 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు.

కొలువుదీరనున్న కొత్త కేబినెట్ - ఖమ్మం నుంచి మంత్రి పదవి ఎవరికో?

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తన పార్టీ ఎమ్మెల్యేలు కారెక్కారు. అనంతరం రెండేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగిన ఆయన మాజీ సీఎంకేసీఆర్(KCR) ఆహ్వానం మేరకు 2016 మే 4న గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనేనని పొంగులేటి బలంగా విశ్వసించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి దక్కిన ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు పార్టీకి పొంగులేటికి మధ్య అగాధం పెంచుతూ వచ్చాయి.

Ponguleti Challages KCR on Khammam Elections :2018 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ గెలుపొందగా మిగిలిన 9 స్థానాల్లో పరాజయం పాలైంది. ఈ క్రమంలో పొంగులేటికి బీఆర్‌ఎస్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ అయిన తనను కాదని నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వడంతో పొంగులేటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ పొంగులేటి రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని భరోసా ఇచ్చారు.

నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు

ఆ తర్వాత రాజ్యసభ అవకాశం దక్కుతుందని భావించినా పొంగులేటికి అదీ దక్కలేదు. బీఆర్‌ఎస్‌లో ఎదురవుతున్న అవమానాలపై దాదాపు 3 ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన అసంతృప్తిని, ఆవేదనను తన అనుచరులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రిపై ఆరోపణలు సంధించడాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించి పార్టీ నుంచి బహిష్కరించింది.

మొదట బీజేపీలోకి వెళ్లాలని భావించిన పొంగులేటి తన కార్యక్తరల అభ్యర్థన మేరకు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గ స్థానాల్లో ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ నేతను అసెంబ్లీ గేట్ తాకనివ్వని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌లో దాదాపు తన పంతం నెగ్గించుకున్నారు. ఇటీవల ప్రకటించిన శాసనసభ ఫలితాల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం రేవంత్​ రెడ్డి మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఛాన్స్​ కొట్టేశారు.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు - మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details