Politicians Prefer to Live in Barkatpura : హైదరాబాద్‌లో నానక్‌రాంగూడ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనగానే వ్యాపారవేత్తలు, సినీనటులు గుర్తుకువస్తారు. అలాగే రాజకీయ నాయకుల నివాసానికి బర్కత్‌పురా నిలయంగా మారింది. రాజకీయ నేతలు సహా పలువురు ప్రజాప్రతినిధుల నివాసాలకు.. తొలి నుంచి నగరంలోని బర్కత్‌పురా పెట్టింది పేరు. నగరం నడిబొడ్డున ఇది ఉండటంతో పాటు.. నాడు భాగ్యనగరం(Hyderabad) అంతగా విస్తరించకపోవడంతో అనేక మంది రాజకీయ నేతలు, వీఐపీలు ఇక్కడే ఉండేవారు. సీఎంల నుంచి మంత్రుల వరకు నివాసం ఏర్పరుచుకున్నారు.
కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సకల సౌకర్యాలు
Telangana Political News :ఇక్కడి విశేషమేమిటంటే..అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం(Secretariat)కు దగ్గరగా ఉండటం, ప్రశాంత వాతావరణం తోడవడంతో ఎక్కువ మంది నాయకులు తమ నివాసానికి బర్కత్‌పురానే మొగ్గు చూపేవారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించిన.. రాంగోపాల్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ఈ ప్రాంతంలోనే నివాసముండేవారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి నేటికీ బర్కత్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉంటున్నారు.
ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో - ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి - ధరణి స్థానంలో భూమాత పోర్టల్