Political Heat Over Telangana Elections ఎన్నికల వేళ.. రాష్ట్రంలో జోష్ అందుకున్న ప్రచారాలు Political Heat in Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది. ఇప్పటికే నాయకులు ప్రచార హోరు పెంచి.. గెలుపే లక్ష్యంగా విస్తృతంగా జనాల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే... అభివృద్ధి ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ... ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధిని తెలుపుతూ.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోను (BRS Manifesto) ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలను తెలియజేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Revanth Reddy Meets Singareni Workers : 'సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'
Minister Talasani Srinivas Election Campaign :రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకీ రంజుకుంటుంది. ఎన్నికల తేదీల నిర్ధారణ, అభ్యర్థుల ప్రకటన జరగడంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. ప్రజల్లోకి వెళ్తూ తమ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గంలో అభ్యర్థి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Thalasani Election Campaign) గురువారం తన ఇంటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
8 రోజుల ప్రణాళికలో భాగంగా డివిజన్ల వారీగా ప్రజల వద్దకు తలసాని వెళ్లనున్నట్లు సమాచారం. సిద్ధం చేసుకున్న ప్రణాళికలో భాగంగా మొదటి రోజు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండిమెట్, మారుతి వీధి, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానా ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గొంగిడి సునీత కృతజ్ఞతలు తెలిపారు. హ్యాట్రిక్ దిశగా సాగి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా ప్రజలు దీవించాలని కోరారు.
KTR Tweet on Congress Bus Yatra : 'తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్.. రాహుల్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం'
Congress Leaders Joining in BRS:నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ ఆశీర్వాద సమ్మేళన సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోమారు దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓ వైపు నేతలంతా ప్రచారాలకు సిద్ధమవుతుండగా... మరోపక్క నాయకుల పార్టీ ఫిరాయింపులు పరంపరగా కొనసాగుతున్నాయి. గద్వాల జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్ది తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారితోపాటు పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నాయకులను మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీపైనమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
BRS Special Strategy against Disgruntled Leaders : అసంతృప్తులపై బీఆర్‌ఎస్ ప్రత్యేక వ్యూహం.. సొంత పార్టీ నేతలకు సముదాయింపు.. కాంగ్రెస్ నాయకులపై ఆకర్షణ మంత్రం