ప్రకాశం జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన సతీశ్ బాబు హైదరాబాద్‌లోని ముసాపేట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతని మిత్రుడు భీమవరానికి చెందిన హేమంత్ కొంతకాలంగా సతీశ్ వద్దనే పనిచేస్తూ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. వారి సంస్థలో పనిచేసే ప్రియాంక హేమంత్‌తో చనువుగా ఉండేది. ప్రియాంకతో కలిసి చనువుగా ఉండవద్దని హేమంత్‌ను పలుమార్లు సతీశ్ హెచ్చరించాడు. సాఫ్ట్‌వేర్ సంస్థ నష్టాల్లో ఉండడం వల్ల హేమంత్‌కు ఇచ్చే వేతనం తగ్గించాడు.
ప్రణాళికతోనే హత్య
ఇదంతా మనసులో పెట్టుకున్న హేమంత్.. సతీశ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 28న ఇద్దరు హేమంత్ ఇంటి వద్ద మద్యం సేవించారు. మత్తులో ఉన్న సతీశ్‌ను హేమంత్ ఇనుప సుత్తితో తలపై మోదీ చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రియాంక ప్రమేయం, హేమంత్‌కు ఇంకెవరైనా సహకరించారా అనే అంశాలపై విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు.
సతీశ్ బాబు హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇవీ చూడండి : లక్షల్లో లావాదేవీలు... కోట్లలో స్వాహా