హైదరాబాద్ చందానగర్లో గంజాయి తరలిస్తున్న రాజేందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 100 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజధానికి సరుకును తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
100 కిలోల గంజాయి స్వాధీనం... నిందితుడి అరెస్టు - గంజాయి స్వాధీనం
రాజధానిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 100 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి స్వాధీనం