lorry stuck in flood water in Hyderabad: హైదరాబాద్ శివారులో వరద నీటిలో చిక్కుకున్న లారీ నుంచి డ్రైవర్, ఇద్దరు కూలీలను శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్‌లోని అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తన వరద నీరు చేరింది. ముందు జాగ్రత్తగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. అటుగా ఎవరు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఎవరూ లేని సమయం చూసి లారీ డ్రైవర్.. మరో ఇద్దరు కూలీలు బారికేడ్లు తొలగించి అండర్ పాస్ బ్రిడ్జ్ గుండా వెళ్లడానికి ప్రయత్నించారు.
వద్దంటే వెళ్లి వరదలో చిక్కారుగా.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా!! - హైదరాబాద్‌లో వర్షాలు
lorry stuck in flood water in Hyderabad: గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా శంషాబాద్‌లోని అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తన వరద నీరు చేరగా.. ముందు జాగ్రత్తగా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అటుగా ఎవరు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఎవరూ లేని సమయం చూసి ఓ లారీ డ్రైవర్.. మరో ఇద్దరు కూలీలు బారికేడ్లు తొలగించి వెళ్లగా వారికి ఏం జరిగిందటే..
lorry stuck in flood water
ఈ క్రమంలో లారీ వరద నీటిలో మునిగిపోయింది. లారీ డ్రైవర్, ఇద్దరు కూలీలు.. లారీ పైకి చేరుకుని చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు.. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూలీలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. వరద నీరు నిలిచిన ప్రాంతాలలో వాహనదారులు రాకపోకలు సాగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: