రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వైఎస్ షర్మిల రేపు నిర్వహించనున్న దీక్షకు ఒకరోజు అనుమతి లభించింది. ఇందిరా పార్కు వద్ద మూడు రోజుల దీక్షకు షర్మిల ప్రతినిధులు పోలీసులను అనుమతి కోరగా.. రేపు ఒక్కరోజు మాత్రమే దీక్ష నిర్వహించుకునేలా అనుమతించారు.
ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్షకు అనుమతి
ఇందిరా పార్కు వద్ద వైఎస్ షర్మిల రేపు నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
వైఎస్ షర్మిల దీక్ష
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.