తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటింగ్​లో ముందున్న పోలీస్​బాస్​లు - ghmc polls 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసు ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Police officers exercising their right to vote in ghmc elections 2020
ఓటు హక్కు వినియోగించుకున్న పోలీస్​ ఆఫీసర్స్​

By

Published : Dec 1, 2020, 12:30 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న పోలీస్​ ఆఫీసర్స్​

ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. కుందన్​బాగ్ చిన్మయ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన సతీ సమేతంగా ఓటుహక్కును వినియోగించున్నారు.

నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఓటేశారు.

అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ తమ ఓటు హక్కును వినియోగించున్నారు. కొవిడ్‌కు భయపడకుండా నగర ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సీఐడీ డీఐజీ సుమతి, మాజీ విశ్రాంత పోలీసు అధికారి ఎకే ఖాన్, పలువురు ఐఏఎస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి :కేపీహెచ్‌బీలో భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details