Police Implementation Election Code Strictly in Telangana :రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్(Election Commission) విధించిన నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఒక్కో వ్యక్తి రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని.. ఒకవేళ తీసుకెళ్తే కచ్చితమైన ఆధారాలు చూపించాలన్న నిబంధన ఉంది. దీంతో స్థిరాస్తి లావాదేవీలు చాలావరకు నిలిచిపోయాయి. కోడ్(Election Code)కు ముందు చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. కొందరైతే డబ్బు ఇవ్వకపోతే అగ్రిమెంటు రద్దుచేస్తామని హెచ్చరించడంతో కొనుగోలుకు అడ్వాన్సులు ఇచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు.
Peoples Suffer on Telangana Election Code : కొన్నిచోట్ల వ్యవసాయ భూమి, నివాస ప్లాట్లు, గృహాలు నచ్చినప్పటికీ.. అడ్వాన్సు ఇచ్చేందుకు కొనుగోలుదారులు.. తీసుకునేందుకు విక్రయదారులు జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు ఇచ్చేందుకు శ్రేయోభిలాషులు సిద్ధంగా ఉన్నా తీసుకునేందుకు వెనకాడే పరిస్థితులున్నాయి. అలాగే చేబదులు ఇస్తే ఎక్కడ లెక్కలు చూపించాల్సి వస్తుందోనన్న భయం మరికొంతమందిలో ఉంది.
Police Seize Huge Amount of Gold and Money : రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 300 కోట్లకు పైగా జప్తు
మారుమూల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి :ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా గ్రామాల్లో సైతం ఎక్కడికక్కడ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. కూలీ పనులు చేసి కొంచెం కొంచెంగా దాచుకున్న సొమ్ముకు ఆధారాలు ఎక్కడి నుంచి ఇవ్వగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో చిన్న రైతులు పండించిన కూరగాయల్ని ఆటోవాలాలు మార్కెట్‌కు తరలిస్తా ఉంటారు. మార్కెట్ వ్యాపారుల నుంచి వారానికోసారి డబ్బును తెస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లావాదేవీల విషయంలో కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. సంతల్లో పశువులను విక్రయించగా వచ్చిన సొమ్మును ఇంటికి తీసుకురావాలన్నా.. పశువులను కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి డబ్బు తీసుకెళ్లాలన్నా.. తనిఖీలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దసరా తర్వాత నుంచి డిసెంబరు 15 వరకు వివాహాల ముహూర్తాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి దుస్తుల కొనుగోలు, ఆభరణాలు ఆర్డర్ ఇవ్వడం కష్టంగా మారింది.
- భాగ్యనగరంలోని పాతబస్తీకి చెందిన రమేశ్‌కు అత్యవసరంగా రూ.లక్ష అవసరమయ్యాయి. మహబూబ్‌నగర్‌లోని తన స్నేహితుడు శ్రీకాంత్‌కు ఫోన్‌చేసి అప్పుగా ఇవ్వాలని కోరగా సర్దుబాటు చేస్తానని బదులిచ్చాడు. కానీ పోలీసు తనిఖీల్లో పట్టుబడితే తనకేం బాధ్యత ఉండదని ముందుగానే స్పష్టం చేశాడు. దీంతో కొత్త సమస్యలు వస్తాయని రమేశ్ ఊరుకున్నాడు.
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శివారులో ఒక ప్లాట్ కొనుగోలుకు సంబంధించి ఇద్దరి మధ్య నెలరోజుల క్రితం ఒప్పందం కుదిరింది. 45 రోజుల గడువులోగా మిగతా సొమ్ము ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన మేరకు ఇద్దరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కాగా.. నగదు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని, ఎన్నికలు అయ్యేవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని కొనుగోలుదారు కోరారు. అలాగైతే మార్కెట్ ధర పెరిగితే ఆమేరకు అదనపు సొమ్ము చెల్లించాలని విక్రేత సూచించడంతో ఇప్పుడు తలపట్టుకున్నారు.
Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నోట్లకట్టలే.. ఇప్పటి వరకు రూ.168 కోట్లు సీజ్
Huge Amount of Money Seized in Telangana : పాత రికార్డులన్నీ ఢమాల్.. పోలీసుల తనిఖీల్లో రూ.243 కోట్లు సీజ్