హైదరాబాద్ జీడిమెట్లలో కారులో పోలీసు బోర్డు పెట్టుకుని తిరుగుతున్న ఇద్దరు యువకులకు పోలీసులు జరిమానా విధించారు. షాపూర్‌నగర్‌లో జీడిమెట్ల పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇద్దురు యువకులు కారులో పోలీసు బోర్డు పెట్టకుని తిరుగుతూ పోలీసుల కంట పడ్డారు.
కారులో పోలీసు బోర్డు పెట్టుకుని ఏం చేశారంటే..? - తెలంగాణ వార్తలు
కారులో పోలీసు బోర్డు పెట్టుకుని రోడ్లపై తిరుగుతున్న ఇద్దరు యువకులకు పోలీసులు జరిమానా విధించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామని జీడిమెట్ల సీఐ బాలరాజు హెచ్చరించారు.
కారులో పోలీసు బోర్డు పెట్టుకుని ఏం చేశారంటే..?
పోలీసులు వారిని ఆపారు. ఐడీ కార్డు చూపించమనటంతో కారు తమ బావదని తెలిపారు. దీంతో వారికి జరిమానా విధించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జీడిమెట్ల సీఐ బాలరాజు హెచ్చరించారు.
ఇదీ చదవండి:120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్డౌన్