కరోనా నివారణ దృష్ట్యా హైదరాబాద్ నగర శివారుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మూడు రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం వల్ల శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు విధించడమే కాకుండా... వాహనాలను సైతం జప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్ శివారుల్లో భద్రత కట్టుదిట్టం - lock down effects
రెండు మూడు రోజులుగా హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. శివారు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తూ... అవసవరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నగర శివారుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
విజయవాడ జాతీయ రహదారిపై హయత్నగర్, పెద్ద అంబర్పేట్ తదితర ప్రాంతాలలో వాహనాల తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:'భారత్ బయోటెక్'కు కరోనా నివారణ బాధ్యతలు
Last Updated : May 9, 2020, 11:47 AM IST