తెలంగాణ

telangana

ETV Bharat / state

కోటి రూపాయల సిగరెట్ల చోరీ... ముగ్గురు అరెస్టు - police

ఈ నెల 2న జరిగిన సిగరెట్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మరో ముగ్గురు పరారీ ఉన్నారని వారిని త్వరలో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు.

police chased cigarettes theft case in hyderabad
సిగరెట్ల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు

By

Published : Jan 11, 2020, 4:30 PM IST

కోటి రూపాయల విలువైన సిగరెట్ల దొంగతనం కేసును హైదరాబాద్ చందానగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 80 లక్షల విలువైన సిగరెట్లు, కారు, ట్రాలీ వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతం వాఘలా గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి సంజయ్‌ పండలిక్ ధుమెల్‌, నాందేడ్‌కు చెందిన నామ్‌దేవ్ సాంబజీ ముండే, కాశీనాథ్ కాథంలను అరెస్టు చేశారు. గత నెల 25న నాందేడ్​లో చోరీకి పథకం పన్నారు.

ఈ నెల 2వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుని చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గోదాములో ఉంటిన సిగరెట్ల డబ్బాలను దొంగిలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ పేర్కొన్నారు.

సిగరెట్ల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు

ఇవీ చూడండి: గ్యాస్​ కంపెనీలో పేలుడు... ఆరుగురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details