తెలంగాణ

telangana

ETV Bharat / state

దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు..! హెచ్​ఆర్సీని ఆశ్రయించిన పోలీస్‌ అభ్యర్థులు - police Candidates Meet Hrc

police Candidates approached Hrc: రాష్ట్రంలో పోలీస్‌ అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య అర్హత విభాగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. దీనిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఎంతో మంది అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.

police Candidates Meet Hrc
పోలీస్ అభ్యర్థుల ఆందళన

By

Published : Dec 30, 2022, 7:32 AM IST

దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హెచ్​ఆర్​సీని ఆశ్రయించిన పోలీస్​ అభ్యర్థులు

police Candidates approached Hrc: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎంపిక తీరుపై తాజాగా.. మరో వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయాలు తమ జీవితాలతో ఆటలాడేలా ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు వాపోయారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హులను ఎంపిక చేసిన నాటి నుంచే పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతుండగా.. తాజాగా దేహదారుఢ్య పరీక్ష విషయంలో పలువురు అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పరుగు పందెంలో 1600 మీటర్ల ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. లాంగ్‌జంప్‌ విభాగంలో గతంలో పురుషులకు 3.80 మీటర్లు, మహిళలకు 2.20 మీటర్లుగా ఉన్న దానిని ఇప్పుడు సవరించటంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు. లాంగ్‌జంప్‌లో పురుషులకు 4 మీటర్లు, మహిళలకు రెండున్నర మీటర్లకు పెంచారు. అలాగే, షాట్‌పుట్‌ విభాగంలో గతంలో పురుషులకు 5.60 మీటర్లు, మహిళలకు 3.75 మీటర్లుగా ఉన్న దానిని పురుషులకు 6 మీటర్లకు, స్త్రీలకు 4 మీటర్లకు పెంచారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉత్తీర్ణత సాధించలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు.

దేహదారుఢ్య పరీక్షలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెచ్చిన నిబంధనలతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఎత్తు కొలతలను డిజిటల్ పద్ధతి ద్వారా కొలవడంతో... సాంకేతిక లోపం కారణంగా చాలా మంది అర్హత కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో జరిగిన పొరపాట్లతో పాటు దేహదారుఢ్య పరీక్షల్లో తెచ్చిన కొత్త నిబంధనలు సవరించాలని కోరారు.

పోలీస్‌ నియామక ప్రక్రియలో తొలి నుంచి ఆందోళనల దృష్ట్యా రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో పొరపాట్లు జరిగాయన్న ఆందోళనలు.. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థుల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details