ఆంధ్రప్రదేశ్ విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనేఎస్సీ యువకుడి శిరోముండనం వ్యవహారంఅంతా నూతన్ నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని భావించిన పోలీసులు.... తాను ఇంట్లో లేనట్టుగా నమ్మించేందుకు యత్నిస్తున్నాడని గ్రహించారు. నూతన్ నాయుడు భార్య సహా శిరోముండనానికి పాల్పడిన ఏడుగురు అరెస్టైనా.... అతడు మాత్రం పరారీలో ఉండడాన్ని అనుమానించి ఒక కన్నేసి ఉంచారు.
అదే సమయంలో అరెస్టైన తన భార్యను ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉంచేట్టుగా చేయడం కోసం నూతన్ కొత్త ఎత్తుగడకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో పలువురు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్ చేసిన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి పీవీ రమేశ్‌కు తెలియగా... ఆయన తన పేరుతో ఎవరో ఫేక్‌కాల్స్ చేస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి ఫేక్‌కాల్స్ చేస్తున్నది నూతన్ నాయుడేనని తేల్చారు.
ట్రూ కాలర్‌లో స్పెషల్ సీఎస్‌గా...
నూతన్‌నాయుడు అంత తేలిగ్గా ఏమీ పోలీసులకు పట్టుబడలేదు. తన భార్య కోసం నూతన్ నాయుడే ఫేక్ కాల్ చేశాడా అని పరిశీలించినప్పుడు కూడా అతడి గుట్టు బయట పడలేదు. అదే సమయంలో గతంలో గాజువాక సీఐకి వచ్చిన ఒక ఫోన్ కాల్‌ను పరిశీలించారు. సీఐకి ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి ఒక వాహనాన్ని విడిచి పెట్టాలని... తాను సీఎం సెక్యూరిటీ వింగ్ లో వ్యక్తిని మాట్లాడుతున్నట్టుగా వచ్చిన నెంబర్ తో ఈ నెంబర్ సరిపోల్చడంతో పోలీసుల దృష్టి నూతన్ నాయుడుపైకి మళ్లింది. శిరో ముండనం కేసులో ప్రధాన నిందితురాలిని ఆసుపత్రిలో ఉంచేందుకు చేసిన ఫేక్కాల్స్తో సరిపోల్చారు. అదే నెంబర్‌గా నిర్ధారించుకున్నారు. ఒక నంబర్ నుంచి ట్రూకాలర్‌లో స్పెషల్ సీఎస్‌గా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు.