తెలంగాణ

telangana

ETV Bharat / state

FMS Workers Arrest: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్ - ఎఫ్​ఎమ్​ఎస్​ వార్తలు

FMS Workers Arrest: ఏపీలోని తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎఫ్​.ఎమ్​.ఎస్ కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

FMS Workers Arrest
ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

By

Published : Dec 10, 2021, 12:32 PM IST

FMS Workers Arrest:ఆంధ్రప్రదేశ్​లోనితిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఎఫ్​.ఎమ్​.ఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు నిరసన చేపట్టారు. 13 రోజులుగా తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట కార్మికులు, ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేడు పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.

ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట కార్మికులు, ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఏళ్ళ తరబడి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని… పాదయాత్ర సమయంలో టైంస్కేల్‌ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పరిపాలనాభవనం ముందు భారీగా మొహరించిన పోలీసులు.. కార్మికుల నిరసనలను అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకొంది. అనంతరం వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ పరేడ్‌ మైదానానికి తరలించారు. అరెస్ట్‌పై కార్మికులు మండిపడ్డారు.

ఇదీ చూడండి:MLC Election Polling 2021 : కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ABOUT THE AUTHOR

...view details