Fake Gun License Gang Arrest: హైదరాబాద్‌లో నకిలీ లైసెన్స్‌తో తుపాకులు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థల్లో పనిచేస్తూ అక్రమ దందా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాష్ మేనేజ్‌మేంట్ సర్వీస్‌లలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ముఠాలో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు - Hyderabad Police Latest News
Fake Gun License Gang Arrest: హైదరాబాద్‌లో నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 34 నకిలీ లైసెన్సు పత్రాలు, 33తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Fake Gun License Gang Arrest in hyderabad
Last Updated : Nov 17, 2022, 3:12 PM IST