Police Arrested 3 Drugs Suppliers in Hyderabad : రెండు వేర్వేరు కేసుల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్టేషన్ పరిధిలో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న మనోజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు రాజస్థాన్‌కు చెందిన మనోజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Drugs Seize in Hyderabad : రాయదుర్గంలో డ్రగ్స్ స్వాధీనం.. రాజమండ్రికి చెందిన ముఠా అరెస్ట్
నిందితులు రాజస్థాన్ నుంచి నగరానికి ప్రైవేట్ బస్సుల్లో, లారీల్లో సజ్జల లోడ్ మధ్యలో డ్రగ్స్ పెట్టి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 50 గ్రాముల ఎండీఎంఏ, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ.. అవసరం ఉన్న వారికి రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి.. గ్రాము రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు పూనం చంద్ పరారీలో ఉన్నట్లు వివరించారు.
50 Crore Worth Drugs seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో.. రూ.50 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
మరో కేసులో ఉప్పల్ పోలీసులతో కలిసి ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. సీలేరు నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగోల్‌కు చెందిన కుంచల శ్రీను, అనకాపల్లికి చెందిన కల్ల రాములు అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. గంజాయితో పాటు బొలెరో వాహనం, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి. కొంతకాలంగా తెలంగాణ పోలీసులు డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు తరువాత మాదర ద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, ఇన్ఫార్మర్ల సాయంతో నగరంలో ఇప్పటికే చాలాసార్లు దాడులు నిర్వహించి డ్రగ్స్ పట్టుకున్నారు. ఇటీవల టాలీవుడ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం