'‘దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమో అనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్డౌన్పై ప్రకటన చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి ముఖ్యమంత్రులందరితో చర్చించకుండా లాక్డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరని చెబుతూ వస్తున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి'’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ... 'దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్డౌన్ ముగిసింది. ప్రస్తుతం అన్లాక్ 1.0 నడుస్తోంది'. ఇప్పుడు మనమంతా అన్లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించుకోవాలని ప్రధాన మంత్రి బదులిచ్చారు.
కరోనా నివారణ చర్యలపై ప్రధానికి కేసీఆర్ వివరణ
‘‘కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని... ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని కేసీఆర్ తెలిపారు. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తోన్న పోరుతో కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 'తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా కృషి చేస్తోన్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ఉందని' ముఖ్యమంత్రి వివరించారు. మళ్లీ మామూలు జీవితం గడిపే రోజులు వస్తాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
'వలస కూలీలను అనుమతించండి'