తెలంగాణ

telangana

ETV Bharat / state

PM Modi Tour: 12న తెలంగాణలో మోదీ పర్యటన.. ఈసారైనా కేసీఆర్ హాజరవుతారా? - రామగుండంలో మోదీ పర్యటన

PM Modi Tour: తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈనెల 12న రామగుండంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.

PM
PM

By

Published : Nov 4, 2022, 3:46 PM IST

PM Modi Tour:ఈనెల 12న రామగుండంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్... ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుసార్లు తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ పాల్గొనలేదు. అందుకు కారణాలు కూడా కేసీఆర్ వివరించారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్... ఈ నేపథ్యంలో మోదీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీలోని విశాఖలోనూ పర్యటించనున్నారు. 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణకు పయనం కానున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details