అనాథ పిల్లలకు అన్ని విధాల చేయూతనివ్వాలని తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేసం తెలిపారు. గత నెల రోజులుగా హుస్సేన్ సాగర్‌లో నిర్వహించిన సెయిలింగ్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసారు. అనాథలను చేరదీసి వారికి వసతి, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సంస్థ నిర్వహకులను అభినందించారు. ఆశ్రమ భవనంపై మరో అంతస్తు నిర్మించేందుకు ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటించారు.
'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి' - orphans
అనాథ విద్యార్థులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. హైదరాబాద్ బేగంబజార్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా అనాథ ఆశ్రమంలో సెయిలింగ్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.
'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి'