కరోనా సోకి ప్రమాదకర పరిస్థితుల్లో గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురికి ప్లాస్మా వైద్యం చేయాలని వైద్యులు నిర్ణయించారు. వీరికి ఇప్పటికే ఇతర వ్యాధులు ఉండటంతో పలు రకాల చికిత్సలు చేసినా కోలుకోవడం లేదు. వీరి ప్రాణాలను కాపాడాలంటే ప్లాస్మా చికిత్సే ఉపయోగపడుతుందని వైద్యులు భావిస్తున్నారు.
గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స! - కరోనా వైరస్ వార్తలు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ముగ్గురికి ప్లాస్మా చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స!
ఇందుకోసం.. కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినవారిలో బ్లడ్ గ్రూపును అనుసరించి ముగ్గురి నుంచి ప్లాస్మాను సేకరించి వీరికి వైద్యం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం.. ఇప్పటికే కరోనా వ్యాధికి చికిత్స పొంది నయమై డిశ్ఛార్జి అయిన వారి నుంచి ప్లాస్మాను సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు