ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశం కోసం రైతు కోటా కింద కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) జరగనుంది. నవంబరు 1 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ (హానర్స్ ) కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ కౌన్సెలింగ్ హాజరుకావాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ప్రాంగణం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్(pjtsau counselling dates 2021) ప్రక్రియ జరగనుందని వెల్లడించారు.
pjtsau counselling dates 2021: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ ఎప్పుడంటే? - తెలంగాణ వార్తలు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల కౌన్సిలింగ్(pjtsau counselling dates 2021) తేదీలు ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. కౌన్సెలింగ్ విధానాన్ని వివరించారు.
బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సులో 16 సీట్లు, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సులో- 16 సీట్లు, బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో- 30 సీట్లకు టీఎస్ ఎంసెట్-2021 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు బీటెక్ - అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో రైతు కోటాలో సీటు పొందాలంటే అభ్యర్థి కనీసం 4 ఏళ్లపాటు విధిగా గ్రామీణ ప్రాంతంలోని విద్యాసంస్థలో చదివి ఉండాలని తెలిపారు. కనీసం ఒక ఎకరం విస్తీర్ణం భూమి... తల్లి లేదా తండ్రి అభ్యర్థి పేరు మీద కలిగి ఉండాలని చెప్పారు. ఇక పూర్తి పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ : www.pjtsau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:etela campaign: 'ప్రేమతో ఓట్లు అడగాల్సింది పోయి తెరాస బెదిరిస్తోంది'