తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలిసెట్​-2020 ర్యాంకులతోనే డిప్లొమా ప్రవేశాలు

ప్రొఫెసర్​ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రవేశాలను పాలిసెట్​-2020 ర్యాంకుల ఆధారంగా చేపట్టనున్నారు. ఈ దరఖాస్తులు చేయడానికి అనుసరించాల్సిన నియమాలు వర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌కుమార్ తెలిపారు.

Pjtsau Diploma Notification
పాలిసెట్​-2020 ర్యాంకులతోనే డిప్లొమో ప్రవేశాలు

By

Published : Sep 17, 2020, 7:46 PM IST

రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా జరగనున్నాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందగోరు అభ్యర్థులు పాలిసెట్ - 2020 ప్రవేశ పరీక్షలో అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో సాధించిన ర్యాంకులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌ల్లో ఉన్న 240 డిప్లొమా సీట్లు, అనుబంధ పాలిటెక్నిక్‌ల్లో ఉన్న 630 సీట్ల భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతూ... ప్రవేశ ప్రకటన విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు విశ్వవిద్యాలయ అడ్మిషన్‌ నోటిఫికేషన్ ప్రకారంగా విడిగా కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. పాలిసెట్ - 2020 ర్యాంకు లేనిచో విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు.

సీట్ల కేటాయింపుల్లో విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ నియమాలను పాటిస్తూ నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబరు 16గా నిర్ణయించారు. ఈ దరఖాస్తులు చేయడానికి అనుసరించాల్సిన నియమాలు, పూర్తి మార్గదర్శక సూత్రాల వివరాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌కుమార్ వెల్లడించారు. వివరాల కోసం www.pjtsau.edu.inలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఈ నెల 27 నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details