ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ - హానర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సిలింగ్‌ను వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తరుణంలో ఇంకా మిగిలిపోయిన బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సు సీట్ల భర్తీ కోసం మరోసారి కౌన్సిలింగ్‌ను నిర్వహించనుంది.
నవంబర్ 7న బీఎస్సీ- హానర్స్ రెండో విడత కౌన్సిలింగ్ - pjtsau latest news
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ-హానర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సిలింగ్‌ను జరపనున్నారు. ఈ నెల 7న కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు.
నవంబర్ 7న బీఎస్సీ- హానర్స్ రెండో విడత కౌన్సిలింగ్
ఈ నెల 7న మధ్యాహ్నం రెండు గంటలకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో సీటు లభించిన విద్యార్థులు వెంటనే నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం www.pjtsau.edu.inవెబ్సైట్లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.