రాష్ట్రంలో వ్యవసాయ డిప్లొమా కోర్సులకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 10 నుంచి 13వ వరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వర్సిటీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత మిగిలిన సీట్లకు రెండో విడత నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ - వ్యవసాయ డిప్లొమా కోర్సుల రెండో విడత కౌన్సిలింగ్
వ్యవసాయ డిప్లొమా కోర్సుల రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను వర్సిటీ ప్రకటించింది. మొదటి విడతలో మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ నిబంధనలు ప్రకారం కేటాయింపు జరగనుందని స్పష్టం చేశారు.
వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సిలింగ్
సీట్లు లభ్యమైన వెంటనే అభ్యర్థులు నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. సీట్ల అందుబాటు, ఫీజుల వివరాలు వంటి సమగ్రమైన సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఐటీ సోదాల్లో రూ.1000 కోట్ల నల్లధనం పట్టివేత!