తెలంగాణ

telangana

ETV Bharat / state

పైలట్​ను కలవరపెట్టిన లేజర్​ లైట్​

లేజర్ లైటు...  విమానం నడిపే ఓ పైలట్​ని అయోమయానికి గురిచేసింది. నేలపై ఉన్న చిన్న లైటు...ఆకాశంలో పైలట్​ను ఎలా ఇబ్బంది పెట్టిందనుకుంటున్నారా.. అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే.

లేజర్ లైటుతో పైలట్ ఇబ్బందులు

By

Published : Mar 19, 2019, 4:49 PM IST

Updated : Mar 19, 2019, 5:40 PM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. రషీద్‌గూడలో నివసించే శివమణి అనే యువకుడు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా లేజర్‌లైట్లు ఏర్పాటు చేశాడు. వాటి కారణంగా విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్​ అయెమయానికి గురయ్యారు. లేజర్ వెలుగుల వల్ల తాను పడిన ఇబ్బందులను ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడు.

15 కిలోమీటర్ల పరిధిలో లేజర్‌ షో నిషేధం

వెంటనే స్పందించిన అధికారులు పోలీసులకు సమాచారమందించారు. శివమణినే లేజర్ లైట్లు ఏర్పాటు చేశాడని తెలుసుకొని అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ చుట్టుపక్కలలేజర్ లైట్ల వల్ల పైలట్లకు తరచూ ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. సౌదీ ఘటన తరువాత విమానాశ్రయం15 కిలోమీటర్ల పరిధిలో లేజర్‌ షో లైటింగ్‌లను నిషేధించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చదవండి:ఇందూరులో కేసీఆర్ శంఖారావం

Last Updated : Mar 19, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details